Veede Mana Varasudu: రైతుల సమస్యలపై మూవీ.. సెన్సార్ సభ్యుల నుంచి ప్ర‌శంస‌లు

Veede Mana Varasudu: రైతుల సమస్యలపై మూవీ.. సెన్సార్ సభ్యుల నుంచి ప్ర‌శంస‌లు

రమేష్ ఉప్పు హీరోగా, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘వీడే మన వారసుడు’.లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించారు. సమ్మెట‌‌‌‌ గాంధీ, దేవసేన, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్  కీలక పాత్రలు పోషించారు.

జులై 18న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, దర్శకులు వీఎన్ ఆదిత్య, సముద్ర, నటుడు పృథ్వీ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

ఈ సందర్భంగా రమేష్ ఉప్పు మాట్లాడుతూ ‘మంచి మెసేజ్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. రైతుల కష్టాలను చూపించాం. ఇందులోని ఎమోషన్స్  ప్రతి ఒక్కరిని క‌‌‌‌దిలిస్తాయి’అని చెప్పారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మూవీ సెన్సార్ సభ్యుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ మూవీ చూసిన సెన్సార్ బృందం చిత్రయూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చూపించిన మూవీ మెచ్చుకున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.