KothapalliloOkkappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు.. రానా నుంచి మరో డిఫెరెంట్ మూవీ..

KothapalliloOkkappudu: కొత్తపల్లిలో ఒకప్పుడు.. రానా నుంచి మరో డిఫెరెంట్ మూవీ..

కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా మెప్పించిన ప్రవీణ పరుచూరి.. దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’అనే నోస్టాలజిక్‌‌‌‌ మూవీని తెరకెక్కించారు.  ఒక సంఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఒక గ్రామీణ యువకుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కించారు.

ఒకప్పటి పల్లెటూరు నేపథ్యంలో సున్నితమైన హాస్యంతో కూడిన లైట్ హార్టెడ్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ ఇది. స్పిరిట్ మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌ ద్వారా వరుస కంటెంట్‌‌‌‌ డ్రివెన్ సినిమాలను సపోర్ట్ చేస్తున్న హీరో రానా దగ్గుబాటి.. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

గతంలో ప్రవీణ నిర్మించిన ‘కేరాఫ్​ కంచరపాలెం’చిత్రాన్ని కూడా రానా విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని రకాల కమర్షియల్‌‌‌‌ అంశాలతో తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్‌‌‌‌లా తెరకెక్కించిన ఈ మూవీని త్వరలోనే థియేటర్స్‌‌‌‌లో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.