
కోల్బెల్ట్, వెలుగు: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వస్తున్నందున్న దసరా సెలవు తేదీని సింగరేణిలో మార్చాలని బీఎంఎస్స్టేట్ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, సీఐటీయూ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఆదివారం వేర్వేరుగా ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
మహాత్ముడి జయంతి రోజు జీవహింసకు పాల్పడడం చట్టవిరుద్ధమని, దసరా పండుగను కార్మికులు, వారి కుటుంబాలు సంతోషంగా జరుపుకునేలా సర్కార్, సింగరేణి యాజమాన్యం అక్టోబర్ 1న లేదా 3న దసరా సెలవు ప్రకటించాలని కోరారు. ఒకే రోజు రెండు పీహెచ్డీలు ఉండటం వల్ల కార్మికుల ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. దేశంలోని ఇతర బొగ్గు పరిశ్రమల్లో సెలవును మార్చినట్లు తెలిపారు.
సింగరేణిలో అక్టోబర్3న దసరా పండుగ సెలవు ప్రకటించాలని డిమాండ్చేస్తూ సోమవారం శ్రీరాంపూర్ఏరియా బొగ్గు గనులపై ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఎస్కే బాజీసైదా పేర్కొన్నారు.