మహేష్ బాబు అన్న కొడుకు కొత్త సినిమా ‘శ్రీనివాస మంగాపురం’..తిరుపతి బ్యాక్డ్రాప్లో అజయ్ భూపతి క్రైం థ్రిల్లర్

మహేష్ బాబు అన్న కొడుకు కొత్త సినిమా ‘శ్రీనివాస మంగాపురం’..తిరుపతి బ్యాక్డ్రాప్లో అజయ్ భూపతి క్రైం థ్రిల్లర్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా తన తెరంగేట్రం చేస్తున్నాడు. ఇటీవలే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా.. ఇవాళ (2025 నవంబర్ 27న) మరో క్రేజీ అప్డేట్ పంచుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి.

విలేజ్ బ్యాక్డ్రాప్తో పాటు లవ్ స్టోరీ, యాక్షన్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికర టైటిల్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సినిమా పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. చేతిలో తుపాకీ పట్టుకున్న ఓ పురుషుడి చేతిని ఓ మహిళ అడ్డుకుంటున్నట్లుగా ఉంది. ఆ తుపాకీపై మూడు నామాలు ఉండటం గమనార్హం. ఆ వెనుకే తిరుమల కొండలు, శ్రీవారి ఆలయం కనిపిస్తాయి. నిజానికి ఈ సినిమా పోస్టర్,టైటిల్ ఆసక్తి రేపుతున్నాయి.

మైథలాజికల్ టచ్తో కూడిన ఓ మిస్టరీని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూపిస్తోంది. గతంలో అజయ్ భూపతి తెరకెక్కించిన RX100, మహా సముద్రం, మంగళవారం సినిమాల తరహా ఓ ఇంటెన్స్ యాంగిల్ను చూపించనున్నాడని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చాడు అజయ్.

సినీ వర్గాల టాక్ ప్రకారం కథ ఎలా ఉంటుందంటే?

పోస్టర్లో చెప్పినట్లుగానే.. సినిమా తిరుపతి బ్యాక్డ్రాప్లో ఉండనుంది. తిరుమల పుణ్యక్షేత్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘శ్రీనివాస మంగాపురం’ లోని ఒక పురాతన ఆలయం చుట్టూ స్టోరీ నడుస్తుందట. ఆ ఆలయం చరిత్ర, అక్కడి వాతావరణం సినిమాకు మెయిన్ అసెట్గా నిలిచేలా డిజైన్ చేశాడట అజయ్.

అంతేకాకుండా అజయ్ గత సినిమాల మాదిరిగా క్రైమ్ యాంగిల్ను ‘శ్రీనివాస మంగాపురం’లో చూపించనున్నాడట. ఆ పురాతన ఆలయంలో జరిగే ఒక భారీ దొంగతనం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీనే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

ఆ దొంగతనానికి, హీరో పాత్రకు ఉన్న లింక్ ఏంటి? అసలు హీరోకి ఆ ఊరికి మధ్యగల సంబంధం ఏంటీ? అనేది సినిమా కథగా తెలుస్తోంది. దానికి తోడు.. హర్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని టాక్. రానున్న అప్డేట్స్లో కథ గురించి మరింత తెలిసే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తోంది. ఇదే ఆమెకు తెలుగులో డెబ్యూ కావడం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చితాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వనీదత్ నిర్మిస్తుంది. మహేష్ బాబు కూడా ‘రాజ కుమారుడు’చిత్రంతో ఈ బ్యానర్ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

రమేష్‌‌ బాబు సినిమాల విషయానికి వస్తే.. తండ్రి కృష్ణ సినిమాతోనే కెరీర్‌‌‌‌ స్టార్ట్ చేశాడు రమేష్‌‌ బాబు. దాదాపు పదిహేను వరకు సినిమాల్లో హీరోగా నటించారు. తన కెరీర్‌‌‌‌లో చాలాసార్లు తండ్రి కృష్ణతోను, తమ్ముడు మహేష్‌‌తోను రమేష్‌‌ కలిసి నటించారు.

ఆ ఇద్దరితోనూ కలిసి చేసిన ‘ముగ్గురు కొడుకులు’ చిత్రం తన కెరీర్‌‌‌‌లోనే బెస్ట్ అండ్ మెమొరబుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రమేష్, మహేష్ ఆయనకి తమ్ముళ్లుగా నటించడం విశేషం. రమేష్‌‌ హీరోగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ చిత్రాన్ని కూడా కృష్ణనే డైరెక్ట్ చేశారు.