Asia Cup 2025: శ్రేయాస్, జైశ్వాల్‌కు దక్కని చోటు.. కారణం చెప్పిన అగార్కర్

Asia Cup 2025: శ్రేయాస్, జైశ్వాల్‌కు దక్కని చోటు.. కారణం చెప్పిన అగార్కర్

ఆసియా కప్ కోసం మంగళవారం (ఆగస్టు 19) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ స్క్వాడ్ కు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. ఏడాదికాలంగా టీ20 వరల్డ్ కప్ ఆడకపోయినా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు జట్టులో స్థానంతో పాటు ఏకంగా వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఇద్దరు ప్లేయర్లకు మాత్రం అర్హత ఉన్నా స్క్వాడ్ లో చోటు దక్కలేదు. వారిలో ఒకరు ఓపెనర్ యశస్వి జైశ్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. జట్టులో చోటు ఖాయమనుకున్నా వీరిద్దరికీ నిరాశ తప్పలేదు. జైశ్వాల్, అయ్యర్ లను ఎందుకు ఎంపిక చేయలేదో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కారణం చెప్పాడు. 

జైశ్వాల్ గురించి అగార్కర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " జట్టులో చోటు దక్కపోవడం యశస్వి జైస్వాల్ బ్యాడ్ లక్. అభిషేక్ శర్మ బాగా రాణిస్తున్నాడు. అదే సమయంలో అతను మాకు ఒక బౌలింగ్ ఆప్షన్. దీంతో దురదృష్టవశాత్తు జైశ్వాల్ కు ఛాన్స్ దక్కలేదు". అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు. శ్రేయాస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ.. " ఎంపిక కాకపోవడంలో శ్రేయాస్ అయ్యర్ తప్పేమీ లేదు. అతను అద్భుతంగా రాణించినా జట్టులో ఎక్కడా ప్లేస్ లేదు. అతను తన అవకాశాల కోసం ఎదురు చూడాలి". అని అగార్కర్ అన్నాడు. 

Also read:-ఆసియా కప్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ..

అంతర్జాతీయ టీ20ల్లో జైశ్వాల్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. సెంచరీతో పాటు 160 కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. 36 యావరేజ్ తో 23 మ్యాచ్ ల్లో 723 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ లోనూ 14 మ్యాచ్ ల్లో 559 పరుగులు చేసి సత్తా చాటాడు. గిల్ కు జట్టులో చోటు ఇవ్వడంతో జైశ్వాల్ తప్పించాల్సి వచ్చింది. ఇక అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యద్బుత్యంగా రాణించాడు. 175 స్ట్రైక్ రేట్ తో 600 పరుగులు చేశాడు. కెప్టెన్ గాను రాణించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అనుకున్నా జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.