టీఆర్టీఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక : పొరిక శ్రవణ్ కుమార్

టీఆర్టీఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక  : పొరిక శ్రవణ్ కుమార్

తాడ్వాయి, వెలుగు : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా రాజు నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు పొరిక శ్రవణ్ కుమార్ తెలిపారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో గౌరవాధ్యక్షుడి ఆధ్వర్యంలో టీఆర్టీఎఫ్ ములుగు జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కొత్త కమిటీని అధ్యక్షుడిగా అజ్మీర రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా ఏడాల సారంగం, అసోసియేట్ అధ్యక్షుడిగా దుగ్గి నారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శిగాచేలా కృష్ణయ్యతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు.