లక్ష్యాన్ని ఛేదించిన ఆకాశ్ మిసైల్ !

లక్ష్యాన్ని ఛేదించిన ఆకాశ్ మిసైల్ !

 న్యూఢిల్లీ: కొత్త తరం మిసైల్ ‘ఆకాశ్ ఎన్‌‌‌‌జీ’ని విజయవంతంగా పరీక్షించినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 10.30కి ఒడిశాలోని చండీపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి టెస్ట్ ఫైర్ చేసినట్లు తెలిపింది. ‘‘అతి తక్కువ ఎత్తులో, హై-స్పీడ్‌‌‌‌లో వెళ్తున్న మానవరహిత ఏరియల్ టార్గెట్‌‌‌‌ను ఛేదించినం. నిర్దేశిత లక్ష్యాన్ని వెపన్ సిస్టమ్‌‌‌‌ ఇంటర్‌‌‌‌‌‌‌‌సెప్ట్ చేసి.. నాశనం చేసింది. తద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్ – కంట్రోల్ – కమ్యూనికేషన్ సిస్టమ్‌‌‌‌తో కూడిన వ్యవస్థ పనితీరును వ్యాలిడేట్ చేసింది. 

ఈ విజయంతో మిసైల్ ట్రయల్స్‌‌‌‌కు మార్గం సుగమమైంది’’ అని చెప్పింది. డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌‌‌‌కు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ టెస్ట్ ఫైర్ చేసినట్లు తెలిపింది. ఇక ఆకాశ్ ఎన్‌‌‌‌జీ రేంజ్ 80 కిలోమీటర్లు. ఇది అత్యాధునిక క్షిపణి వ్యవస్థ. హైస్పీడ్‌‌‌‌తో ఎదురయ్యే ఏరియల్ ముప్పులను అడ్డుకోగలదు.