ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా స్పెషల్.. బెంగాల్ కోచ్ అరుణ్ లాల్

ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా స్పెషల్.. బెంగాల్ కోచ్ అరుణ్ లాల్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్టులో ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని అతడిని తీర్చిదిద్దిన కోచ్, ఇండియా మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ మెచ్చుకున్నాడు.  అకాశ్ చాలా ప్రత్యేకమైన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పాడు. ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన  టెస్టులో ఆకాశ్ కెరీర్ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పది వికెట్ల స్పెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకోవడంతో ఇండియా భారీ విజయం అందుకుంది. 

ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగాల్ రంజీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అతడిని సానబెట్టిన అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రశంసలు కురిపించాడు. ‘ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామర్థ్యాలపై ఎప్పుడూ సందేహం లేదు. తను చాలా బలంగా ఉంటాడు, కష్టపడతాడు. ఇది వరకు అతనికి లేనిది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే. కానీ, ఇప్పుడు తను చాలా నమ్మకంతో  తెలివిగా, ఓపికగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వికెట్ తీయాలని తొందరపడటం లేదు. 

తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంత నమ్మకం పెరిగితే అంత బాగా ఆడతాడు. మరింత స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బౌలింగ్ చేస్తాడు. ఆకాశ్ గంటకు145 కి.మీ స్పీడ్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా వేయగలడు. బ్యాటర్ల భాగస్వామ్యాలను విడగొట్టే అరుదైన సామర్థ్యం అతనికి ఉంది’ అని లాల్ తెలిపాడు. ఆకాశ్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడని, అందుకే మొదట్లో తను దేశం కోసం ఆడతానని కూడా ఊహించలేదని లాల్ చెప్పాడు.

 ‘తాను ఎంత మంచి ఆటగాడో అతనికి తెలియదు. టీమిండియాకు ఆడగలనని కూడా ఆకాశ్ అనుకోలేదు. దాంతో  ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్థం చేసుకోవాలని నేను కోరుకున్నాను. రంజీ గెలవాలి, ఇండియా తరఫున ఆడాలి, ఇంకా చాలా కాలం ఇండియాకు ఆడాలని తనకు చెప్పాను’ అని లాల్ వివరించాడు.