
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ మూవీపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే లైగర్ టీం అక్డీ పక్డీ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. అది యూట్యూబ్ ను షేక్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అక్డీ పక్డీ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. అక్డీ పక్డీ సాంగ్ లో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా విజయ్ డ్యాన్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అక్డీ పక్డీ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న లైగర్ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు.