ఈ నెల 11న 'అక్డి పక్డి' సాంగ్ రిలీజ్

ఈ నెల 11న 'అక్డి పక్డి' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- మాస్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ కీల‌క పాత్రలో న‌టించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఆగ‌స్ట్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్రం బృందం. 

తాజాగా సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు. లైగర్ నుండి మాస్ బీట్ సాంగ్ ప్రోమోను వదిలారు. అక్డి పక్డి.. అంటూ సాగే ఈ సాంగ్ లో అనన్య పాండే, విజయ్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక పూర్తి పాటను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ అవుతోంది.

ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. మ‌ణిశర్మ నేప‌థ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి త‌నిష్క్ బ‌గ్చీ పాట‌లు స‌మ‌కూరుస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఛార్మి, క‌ర‌ణ్ జోహార్‌, అజ‌య్ మెహ‌తాల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు.