Akhanda 2: అఖండ2 రిలీజ్ అప్డేట్.. ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసుకున్న బాలకృష్ణ!

Akhanda 2: అఖండ2 రిలీజ్ అప్డేట్.. ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసుకున్న బాలకృష్ణ!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’.నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌‌‌‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌,  కుంభమేళా, హిమాలయాలల్లో కొంత టాకీ పార్ట్‌‌‌‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ఈ మూవీ షూటింగ్  ఓవైపు శరవేగంగా జరుగుతున్నా.. మరోవైపు సినిమా రిలీజ్ డేట్‌‌‌‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ఫిక్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్‌‌‌‌కు ఎక్కువ టైమ్ అవసరం అవుతుందని భావిస్తుందట టీమ్. దీంతో ఈ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు ఉండడంతో సెంటిమెంట్‌‌‌‌గానూ భావిస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం జూన్‌‌‌‌కు పోస్ట్‌‌‌‌పోన్ అవడంతో బాలయ్య చిత్రాన్ని పొంగల్ బరిలో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రచారంలో ఉన్న ఈ రిలీజ్ డేట్ వ్యవహారంపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.