V6 News

హైదరాబాద్లో అఖండ 2 ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్.. రూ.600 కాదు రూ.300లకు కూడా చూడొచ్చు !

హైదరాబాద్లో అఖండ 2 ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్..  రూ.600 కాదు రూ.300లకు కూడా చూడొచ్చు !

హైదరాబాద్: తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షో బుకింగ్ ఓపెన్ అయింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రీమియర్ షో టికెట్లను బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వెబ్ సైట్స్లో అఖండ 2: తాండవం ప్రీమియర్ షో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. హైదరాబాద్ లోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 600 రూపాయల టికెట్లతో పాటు 300 రూపాయల టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. 

థర్డ్ క్లాస్ సిట్టింగ్ టికెట్ను హైదరాబాద్ సిటీలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 300 రూపాయలకే అందుబాటులో ఉంచారు. దీంతో.. 600 రూపాయలకు టికెట్ కొనలేని కొందరు అభిమానులకు కూడా ప్రీమియర్ షో చూసే అవకాశం దక్కింది. 600 రూపాయల టికెట్ బదులు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని ప్రీమియర్ షోకు వెళుతున్నారు.

ALSO READ : హైదరాబాద్లో.. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్స్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యేది అప్పుడే !

థర్డ్ క్లాస్ టికెట్స్ 300 రూపాయలకు అందుబాటులో ఉంచిన థియేటర్లు ఏంటంటే.. మూసాపేట్ ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్, మాదాపూర్ బీఆర్ హైటెక్ 70mm, మియాపూర్ సాయిరంగ థియేటర్, బాలాపూర్ ఏషియన్ సూపర్ సినిమా, కాచిగూడ ఏషియన్ తారకరామ సినీప్లెక్స్, వీఎల్ఎస్ శ్రీదేవీ 2K ఏసీ డీటీఎస్ చిలకలగూడ, బోరబండ విజేత థియేటర్, కుషాయిగూడ తాళ్లూరి థియేటర్, శంషాబాద్ లక్ష్మీ 70MM థియేటర్, ఆరాధన థియేటర్, వనస్థలిపురం సుష్మా 2K థియేటర్, ఘట్ కేసర్ జగదాంబ థియేటర్, RC పురం సంగీత థియేటర్.. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల అన్నింటిలో థర్డ్ క్లాస్ టికెట్ ధర 300 రూపాయలే ఉండటం గమనార్హం.