V6 News

Akhanda 2: హైదరాబాద్లో.. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్స్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యేది అప్పుడే !

Akhanda 2: హైదరాబాద్లో.. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్స్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యేది అప్పుడే !

తెలంగాణలో అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించి 14 రీల్స్ ప్లస్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వెబ్ సైట్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉంచిన డే1 అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి స్పందన వచ్చిందని.. ప్రీమియర్ షో టికెట్లు గురువారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని 14 రీల్స్ ప్లస్ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది. బుక్ మై షోలో 24 గంటల్లో లక్షా 12 వేలకు పైగా అఖండ 2 టికెట్లు బుక్ అయినట్లు సదరు వెబ్సైట్ పేర్కొంది.

ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షో టికెట్లు బుక్ అయిన సంగతి తెలిసిందే. నైజాంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ప్రీమియర్ షో టికెట్లు గట్టిగానే బుక్ అవ్వొచ్చని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అఖండ 2 ప్రీమియర్ షోకు 600 వరకూ పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

ALSO READ :  విజృంభిస్తున్న ‘అఖండ 2: తాండవం’.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో లక్ష టికెట్లు బుకింగ్స్..

అఖండ 2: తాండవం’ చిత్రం సనాతన ధర్మం గురించి ఉంటుందని.. నమ్మకం, భక్తి మీద నడిచే కథ ఇదని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట అన్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 12న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారితో  ‘లెజెండ్‌‌‌‌’ తర్వాత నిర్మించిన సినిమా ఇది. బాలయ్య బాబు,  బోయపాటిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వరసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది.  ఈ కథకు  పెద్ద  స్పాన్ ఉంది. కొంతభాగం కుంభమేళాలో షూట్ చేశామని తెలిపారు.