V6 News

Akhanda 2 Bookings: విజృంభిస్తున్న ‘అఖండ 2: తాండవం’.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో లక్ష టికెట్లు బుకింగ్స్..

Akhanda 2 Bookings: విజృంభిస్తున్న ‘అఖండ 2: తాండవం’.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో లక్ష టికెట్లు బుకింగ్స్..

నట సింహం, నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ విడుదలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం (డిసెంబర్ 12న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇవాళ గురువారం (డిసెంబర్ 11న) రాత్రి ప్రీమియర్స్తో బాలయ్య సందడి షురూ కానుంది. ఈ సందర్భంగా అఖండ 2 బుకింగ్స్ (డిసెంబర్ 10న) ఓపెన్ అవ్వడంతోనే దుమ్మురేపుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 1.16 లక్షలకు పైగా టికెట్లు బుకింగ్స్ జరిగాయి. బ్లాక్ చేయబడిన సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, అఖండ 2 ప్రీ-సేల్స్ లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 6.03 కోట్ల నెట్ వసూళ్లను సాధించాయి.

అయితే, ఈ బుకింగ్స్ కౌంట్ ప్రతి గంట గంటకు మారుతూ వస్తుంది. ఇది బాలయ్య అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొస్తుంది. ఎందుకంటే.. బాలకృష్ణ కెరీర్ లోనే ఇలాంటి విజృంభణం జరగలేదు. అందువల్ల బుకింగ్స్ సైట్స్ లలో ఇదే ఊపు సినిమా రిలీజైన మూడు రోజుల తర్వాత కూడా ఉంటే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన టీజర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. అందులోని బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఎంతో అర్ధవంతంగా ఉన్నాయి. విభూతి కొండను ఆపేదెవరు? ‘లోక క్షేమం కోరావు.. ఇక నీ క్షేమం ఆ శివుడి అధీనం...’, ‘కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.’ అంటూ సాగే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇందులో బాలయ్య యాక్షన్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఈ క్రమంలో రేపు డిసెంబర్ 12న బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

ALSO READ : నైజాంలో అఖండ2 బుకింగ్స్ ఓపెన్..

నైజాంలో అఖండ2 టికెట్ ధరలు చూసుకుంటే.. డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో ధర 600 రూపాయలకు అమ్ముకునేందుకు  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపు, సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. అఖండ 2 సినిమా రిలీజ్ కష్టాలను దాటుకుని విడుదలవుతున్న సంగతి తెలిసిందే.