అఖండ 2 : తాండవం’ చిత్రం సనాతన ధర్మం గురించి ఉంటుందని.. నమ్మకం, భక్తి మీద నడిచే కథ ఇదని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట అన్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారితో ‘లెజెండ్’ తర్వాత నిర్మించిన సినిమా ఇది. బాలయ్య బాబు, బోయపాటిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వరసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది. ఈ కథకు పెద్ద స్పాన్ ఉంది. కొంతభాగం కుంభమేళాలో షూట్ చేశాం. అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరే సినిమాలోనూ వాడలేరు.
అఖండ’ సినిమాలో చిన్న పిల్లలు, దేవాలయాల జోలికి వస్తే ఆ పరమశివుడే ఆవహించి శిక్షిస్తాడని చూపించారు. ఈ చిత్రం దానికి కొనసాగింపుగా ఉంటూనే అందరి అంచనాలను అధిగమించేలా ఉంటుంది. బాలకృష్ణ గారు మంచి ఎనర్జీతో నటించారు. జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో మేమంతా స్వెటర్లు వేసుకుంటే ఆయన మాత్రం అఘోర గెటప్‌లో స్లీవ్ లెస్‌లో నటించారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే దేశం మొత్తం రిలీజ్ చేయాలని భావించాం. ఇది పాన్ ఇండియా కంటెంట్. గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ యూనివర్స్‌లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది. అది లిమిట్ లెస్’ అని చెప్పారు.
