ఈ నెల 15న ‘ఏజెంట్‌’ టీజర్‌

ఈ నెల 15న ‘ఏజెంట్‌’ టీజర్‌

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం ‘ఏజెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్‌ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్స్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏజెంట్ నుండి తాజా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ నెల 15న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియో ద్వారా టీజర్‌ డేట్‌ ను వదిలారు. హై వోల్టేజ్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు.ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు ‘ఏజెంట్‌’కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో  నటిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు.