Akhil Akkineni: 'లెనిన్' కోసం రిస్క్ తీసుకుంటున్న అఖిల్.. పక్కా మాస్‌తో ఈసారైనా హిట్ కొట్టేనా?

Akhil Akkineni: 'లెనిన్' కోసం రిస్క్ తీసుకుంటున్న అఖిల్.. పక్కా మాస్‌తో ఈసారైనా హిట్ కొట్టేనా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో  మరో కీలకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో తెర కెక్కుతున్న 'లెనిన్'పై సినీ ఇండస్ట్రీలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. వరుస పరాజయాలతో ఉన్న అఖిల్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే, అఖిల్ ఈసారి పక్కా మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ డ్రామాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 ప్రధానంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది.  ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటి‍స్తోంది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ను పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చివరి ఘట్టాలు సినిమాకే కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే  అఖిల్ తన పాత్రలో మరింత లీనమయ్యేందుకు కసరత్తు చేస్తున్నారట. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మళ్లీ ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు. 

Also Read : వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్

నిజానికి ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి అయినా అవుట్ ఫుట్ విషయంలో అసలు కాం ప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ సీక్వెన్స్ సుభారీ స్థాయిలో మళ్లీ రీషూట్ చేయాలని మేకర్స్ భావి స్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో అఖిల్ యాక్షన్ స్టంట్స్ కచ్చితంగా ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చిత్ర బృందం తెలిపింది. అతని కెరీర్లోనే అత్యుత్తమ యాక్షన్ సీక్వెన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ క్లైమాక్స్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది..

ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సేను నటిస్తోంది. నటులు ఈశ్వరి రావు, శివాజీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2026 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.