Akhil Akkineni: కథ కుదిరిందా అఖిల్! తనయుడి కోసం నాగ్ సెట్ చేసిన రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ..డైరెక్టర్ ఎవరంటే?

Akhil Akkineni: కథ కుదిరిందా అఖిల్! తనయుడి కోసం నాగ్ సెట్ చేసిన రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ..డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని అఖిల్ (Akhil Akkineni)కు పాపం బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి.ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ స్టార్ ను కూడా చూడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓ మోస్తారు హిట్టు అందుకున్న ఈ హీరో..ఆ తరువాత సక్సెస్ ను కొనసాగించలేకపోయారు. ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టడానికి అఖిల్..హిట్ కొట్టించాలని ఓ వైపు తండ్రి నాగ్ తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. 

ప్రస్తుతం అఖిల్ చేతిలో కొత్త దర్శకుడు అనిల్‌ కుమార్‌తో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్లు గతేడాది నుంచి వార్తలొస్తున్నాయి.ఈ ప్రాజెక్టు కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయట.ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీకి సుజీత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. 

తాజా విషయానికి వస్తే..అఖిల్ చేతిలో మరో ఇంట్రెస్టింగ్ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు హీరో నాగార్జున కూడా తన తనయుడు అఖిల్‌ కోసం మంచి కథను వెతికి పట్టుకొచ్చాడంటా.ఈ క్రమంలోనే ఇటీవల కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ఫేమ్‌ డైరెక్టర్ మురళీ కిశోర్‌ తన రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో నాగ్‌ను మెప్పించినట్లు సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

Also Read:రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్.. సీరియల్ గా సాగుతున్న ట్విస్టులు

ఈ కథ చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్‌ డ్రామా కథగా ఉండనుందని..అయ్యగారు అఖిల్‌కు సరిగ్గా సరిపోయేలా కథనం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ పై నాగ్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాని అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక అఖిల్ ప్రీవియస్ సినిమా విషయానికి వస్తే..భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ (Agent)బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీంతో అఖిల్ కెరీర్ మళ్ళీ డైలమాలో పడింది.నిజానికి ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అఖిల్ లో ఉన్నాయి కానీ,టైం కలిసిరావడం లేదు అంతే.ఒక్క హిట్టు..ఒకేఒక్క హిట్టు పడితే మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయం అనే చెప్పాలి.మరి ఇప్పుడు చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలతో అయిన అఖిల్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.