Akhil-Jason: దళపతి విజయ్ కొడుకుతో అఖిల్.. సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Akhil-Jason: దళపతి విజయ్ కొడుకుతో అఖిల్.. సినిమా ప్లాన్ చేస్తున్నారా?

సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్‌‌‌‌ విజయ్ కొడుకు సంజయ్ దర్శకత్వంలో ఓ చిత్రం  తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీ సెట్స్‌‌కు అఖిల్ రావడంతో వీరంతా కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు.

సెల్ఫీ టైమ్.. ద బాయ్స్ ఆర్ హేవింగ్ క్రేజీ డే అవుట్ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

జాసన్ సంజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ (2018-2020)లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేసి అటు నుంచి(2020-2022) సం.లో లండన్‌ కెనడాలో స్క్రీన్ రైటింగ్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సును నేర్చుకున్నాడు. ఈ చిత్రం యొక్క యాక్షన్ సన్నివేశాలను మే 7న సందీప్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

ప్రస్తుతం అఖిల్  ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ డైరెక్టర్ మురళీ కిశోర్‌ తో ఓ సినిమా చేస్తున్నాడు. టైటిల్ లెనిన్. శ్రీలీల హీరోయిన్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ డ్రామాగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ పిక్చర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ మూవీ రూపొందుతోంది.