V6 News

బీజేపీని చూసి నేర్చుకోండి: కాంగ్రెస్‌‌కు అఖిలేష్ చురక

బీజేపీని చూసి నేర్చుకోండి: కాంగ్రెస్‌‌కు అఖిలేష్ చురక

భాగస్వామ్య పక్షాలతో ఎలా నడుచుకోవాలో బీజేపీని చూసి నేర్చు కోవాలని కాంగ్రెస్‌‌కు సమాజ్ వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్‌ యాదవ్ సూచించారు. కలిసి పోటీ చేయాలనుకున్న పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తేనే ఎన్నికల్లో నెగ్గుకురాగలమని బీజేపీకి తెలుసన్నారు. అందుకే తక్కువ సీట్లలో పోటీకి సిద్ధమై కూడా భాగస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీతో సీట్ల పంపకాలు కుదరకపోవడంతో కాంగ్రెస్ పొత్తుకు నో చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయబోతోంది.

అఖిలేశ్–మాయావతి ర్యాలీలు
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్నికల ప్రచారంలో భాగంగా 11 జాయింట్ ర్యాలీలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి మే 16 వరకూ ర్యాలీలు జరుగతాయని రెండు పార్టీలు ప్రకటన విడుదల చేశాయి. డియోబంద్, బదౌన్, ఆగ్రా, మెయిన్ పూరీ, రామ్ పూర్, ఫిరోజాబాద్, కన్నౌజ్, ఫైజాబాద్, అజాం ఘర్, గోరఖ్ పూర్, వారణాసిల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. వీటికి ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కూడా హాజరవనున్నారు.