భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా కీలకం

భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా కీలకం

లఖ్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడిగా పొగిడారు. ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, మహాత్మా గాంధీ, మహ్మద్ అలీ జిన్నాలు ఒకే సంస్థలో చదివి లాయర్లు అయ్యారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వీరు కీలకంగా వ్యవహరించారు. పోరాటానికి వారెన్నడూ వెనకడుగు వేయలేదు’ అని ఓ బహిరంగ సభలో అఖిలేశ్ అన్నారు. రైతుల కోసం పోరాడినందుకే పటేల్‌కు సర్దార్ బిరుదు వచ్చిందని.. కానీ ఆయన బాటలో పయనిస్తున్నామని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు రైతులను ఏడిపిస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని పటేల్ నిషేధించారని చెప్పారు. కాగా, ఈ కామెంట్లపై దుమారం రేగుతోంది. జిన్నా చరిత్ర ఏంటో అఖిలేశ్ తెలుసుకోవాలని బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ అన్నారు. హిందువుల మీద జరిగిన సామూహిక హత్యాకాండను ప్రోత్సహించి దేశ విభజనకు కారణమైన వైనాన్ని అఖిలేశ్ అర్థం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం: 

బుర్ఖా వేసుకోలేదని యువతిని గెంటేశాడు

పునీత్.. ఆ పిల్లల్ని నేను చదివిస్తా: హీరో విశాల్

తుపాకీతో బెదిరించి యువతిని రేప్ చేసిన స్నేహితుడు