సీఎం యోగి చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌‌కు పంపాలి: అఖిలేష్ యాదవ్

సీఎం యోగి చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌‌కు పంపాలి: అఖిలేష్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌‌ చొరబాటుదారుడని సమాజ్‌‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​యాదవ్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయన్ను తిరిగి అక్కడికే పంపాలన్నారు. అలాగే సిద్ధాంతం, భావజాలం పరంగా కూడాను ఆయన చొరబాటుదారుడే అన్నారు. యోగి ముందు నుంచి బీజేపీలో లేరని ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారని చెప్పారు. 

కొన్ని పార్టీలు చొరబాట్లను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. ఇలాంటి చొరబాటుదారులను ఎప్పుడు తొలగిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఒక్క గుజరాత్ సరిహద్దుల్లో మాత్రమే చొరబాట్లు ఉండవని ఎద్దేవా చేశారు. ఆదివారం రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా లక్నోలోని లోహియా పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.