యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా ఎస్సీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి జోన్ డీసీపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కమిషనరేట్ల పునర్వవస్థీకరణతో యాదాద్రి జోన్, పోలీస్ శాఖలో జిల్లాగా ఏర్పడింది. దీంతో జిల్లా ఎస్పీ కేడర్‌కు మారింది.
