ఆసియా అండర్ – 23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ లో అక్షయ్‌, విక్కీకి గోల్డ్‌

ఆసియా అండర్ – 23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ లో అక్షయ్‌, విక్కీకి గోల్డ్‌

డానాంగ్‌ (వియత్నాం): ఆసియా అండర్–-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన మెన్స్‌ 57 కేజీల ఫైనల్లో అక్షయ్‌ 4–-2 తేడాతో యెలామన్ అమన్‌గెల్ది (కజకిస్తాన్‌)పై గెలిచి స్వర్ణం సాధించాడు. 97 కేజీల విభాగంలో విక్కీ 7–-5 తేడాతో షెర్జోద్ పొయనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను ఓడించి గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. 

53 కేజీల్లో ముస్కాన్‌ 6–2తో తి మై లిన్‌ ఎన్గుయెన్‌ (వియత్నాం)పై, 57 కేజీల్లో తపస్య 4–0తో అల్టిన్ షాగాయేవా (కజకిస్తాన్‌)పై, 62 కేజీల్లో భాగ్యశ్రీ 4–0తో తినిస్‌ డుబెక్న్‌ (కిర్గిస్తాన్‌)పై, 65 కేజీల్లో పుల్కిత్‌ 4–తో నార్ఖాజిద్‌ న్యామ్‌సురెన్‌ (మంగోలియా)పై నెగ్గి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. 72 కేజీల్లో అమృత 2–4తో ఓడ్గెరెల్‌ ఎడెన్‌ (మంగోలియా) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది.