
జూలై 19న మణిపూర్ హింసకు సంబంధించిన ఓ పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఇప్పుడు అంతా ఆ దారుణమైన ఘటనపై గళం విప్పుతున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంపై ఊరేగించడాన్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత, మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాగా తాజాగా ఈ ఘటనపై అక్షయ్ కుమార్, రిచా చద్దా లాంటి ఇతర ప్రముఖులు స్పందించారు.
Shaken, disgusted to see the video of violence against women in Manipur. I hope the culprits get such a harsh punishment that no one ever thinks of doing a horrifying thing like this again.
— Akshay Kumar (@akshaykumar) July 20, 2023
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వీడియో చూసి విస్తుపోయాను. అసహ్యించుకున్నాను. దోషులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. అప్పుడే ఇలాంటి భయంకరమైన పనిని మళ్లీ ఎవరూ చేయకుండా ఉంటారు అని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
The video of violence against women in Manipur is horrifying and has shaken me to the core. I pray the women get justice at the earliest. Those responsible must face the most SEVERE punishment they deserve.
— Kiara Advani (@advani_kiara) July 20, 2023
ఇక రిచా చద్ధా కూడా ఇదే తరహా ట్వీట్ చేసింది. “అవమానకరం! భయంకరమైనది! చట్టవిరుద్ధం.. అంటూ తన కోపాన్ని వెల్లగక్కింది. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాకు కోపం వస్తోంది. ఇలాంటి నేరానికి పాల్పడ్డందుకు అది ఎవరైనా సరే శిక్షించాల్సిందే. మహిళ గౌరవంపై దాడి చేయడం మానవత్వంపైనే దాడి అని రితీష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు. "మణిపూర్‌లో మహిళలపై హింసకు సంబంధించిన ఈ వీడియో భయానకంగా ఉంది, నన్ను కదిలించింది. మహిళలకు వీలైనంత త్వరగా న్యాయం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధ్యులు తగిన శిక్షను అనుభవించాలి" అని కియారా అద్వానీ రాసుకువచ్చింది. ఇదే తరహాలో పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ దారుణమైన ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Shameful! Horrific! Lawless! ? https://t.co/w6dTmJ1JfD
— RichaChadha (@RichaChadha) July 19, 2023