అక్షయ్ కుమార్ ఇంట విషాదం..

V6 Velugu Posted on Sep 08, 2021

ముంబాయి: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణా భాటియా (80) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు హీరానందాని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ‘సిండ్రిల్లా’ సినిమా షూటింగ్ లో భాగంగా విదేశాల్లో ఉన్న అక్షయ్.. విషయం తెలిసిన వెంటనే ముంబాయికి చేరుకున్నారు. అరుణ భాటియా ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అక్షయ్ ట్వీట్ చేశారు.

‘ఆమె నా ప్రాణం. ఆమె మరణంతో నేను భరించలేని బాధను అనుభవిస్తున్నాను. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈ ఉదయం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఇతర ప్రపంచంలో ఉన్న నాన్నతో కలిసిపోయారు. నాకు మరియు నా కుటుంబం కోసం మీరు చేసిన ప్రార్థనలను గౌరవిస్తాను. ఓం శాంతి’ అని ఆయన ట్వీట్ చేశారు.

 

Tagged Bollywood, akshay kumar, hiranandani hospital, Aruna Bhatia, cinderella, bell botom

Latest Videos

Subscribe Now

More News