బీఆర్ఎస్​ కార్పొరేటర్​ ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోండి : ఆకుల సతీశ్

బీఆర్ఎస్​ కార్పొరేటర్​ ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోండి :  ఆకుల సతీశ్

జీడిమెట్ల, వెలుగు :  నిజాంపేట్ కార్పొరేషన్​ బీఆర్ఎస్​ కార్పొరేటర్​ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్​ బుధవారం డిప్యూటీ తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ నిజాంపేట్​లో సర్వే నంబర్191లో 125గజాలకు పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ భూమి ఆక్రమించి 190గజాల్లో అపార్ట్​మెంట్​ నిర్మాణం చేశాడని ఆరోపించారు.

అలాగే 400 గజాల ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు, 8 బేస్​మెంట్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.  అధికారులు తక్షణమే స్పందించి కార్పొరేటర్​ బాలాజీ నాయక్​పై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో అరుణ్​రావు, శేషారావు, ప్రసాద్ ​రాజు, మాధవరాజు తదితరులు ఉన్నారు.