
- యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్
ముషీరాబాద్,వెలుగు : ఎస్ బీఐ కాంట్రాక్టు వర్కర్స్ కు కనీస వేతనం రూ. 30 వేలకు ఇవ్వాలని ఆల్ ఇండియా ఎస్ బీఐ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్లో 8 గంటల పని విధానం లేదని, కాంట్రాక్టు వర్కర్స్ ను 12 గంటల వెట్టి చాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
జీతం రూ. 15 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వచ్చే ఆగస్టులో చలో ఢిల్లీ నిర్వహించి వేలాదిమందితో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేస్తామని పేర్కొన్నారు. యూనియన్ ఏవో విభాగం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి పాండు, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, సాయి పాల్గొన్నారు.