వెనుకబడిన వర్గాలకు 33శాతం టికెట్లు కేటాయించండి:ఆకునూరి మురళి

 వెనుకబడిన వర్గాలకు 33శాతం టికెట్లు కేటాయించండి:ఆకునూరి మురళి
  • కాంగ్రెస్​కు ఆకునూరి మురళి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెనుకబడిన  వర్గాలకు 33 శాతం టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ ను ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కోరారు. శనివారం ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు లెటర్ రాశారు. బీసీలు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాల జనాభా రాష్ర్టంలో అధిక శాతం ఉందని  లేఖలో వెల్లడించారు. బీసీలకు 34 టిక్కెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని మురళి కోరారు. సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలన్నారు. ఈ సీట్లు ఇస్తే రాష్ర్ట ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరుగుతుందని మురళి పేర్కొన్నారు.