నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకొచ్చిన్రా? : ఆకునూరి మురళి

 నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకొచ్చిన్రా? : ఆకునూరి మురళి

కేటీఆర్ అబద్ధపు ప్రచారాలు చూసి తెలంగాణ సిగ్గుపడుతున్నదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. తొమ్మిదిన్నర ఏండ్ల తర్వాత నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల్లో ఎన్నికలు అని, ఓడిపోతామనే భయంతోనే జాబ్ క్యాలెండర్​పై ప్రకటన చేశారని విమర్శించారు. ఇటీవల అశోక్​నగర్​లో మంత్రి కేటీఆర్ నిరుద్యోగులతో ముఖాముఖి అయ్యారు. నిరుద్యోగులకు మాది భరోసా అని చెప్పిన వీడియో క్లిప్​ను ఆకునూరి మురళి ట్విట్టర్​లో షేర్ చేశారు. ‘

‘రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఐదు రూపాయల భోజనం తింటూ ఏండ్ల తరబడి చిక్కడపల్లి, అశోక్​నగర్ గల్లీల్లో కష్టపడినప్పుడు నువ్వు అమెరికా, యూరప్, దుబాయ్ తిరుక్కుంటూ ఎంజాయ్ చేసినవ్. నీకు తెలంగాణ యువత గురించి ఆలోచించే సోయి కూడా ఉందా? తెలంగాణ యువతను నిర్వీర్యం చేసిన్రు..”అని కేటీఆర్ పై ఆకునూరి మురళి మండిపడ్డారు. ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగ యువకులే బీఆర్ఎస్​కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.