పార్టీ ఫిరాయింపులు జరక్కుండా 1000 మందితో యాక్షన్ టీమ్: ఆకునూరి మురళి

పార్టీ ఫిరాయింపులు జరక్కుండా 1000 మందితో యాక్షన్ టీమ్: ఆకునూరి మురళి

కేసీఆర్..  40 సీట్లు వాస్తే చాలు మిగతా సీట్లు కొనుక్కోవచ్చు అనే ధీమాతో ఉన్నాడని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు.  పదేళ్ళ పాలనపై తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో దాగి ఉందని.. రేపు ఫలితాలు వచ్చాక 'ఏం చేద్దాం' అనే అంశంపై డిసెంబర్ 2వ తేదీ శనివారం  సోమాజిగూడ ప్రెస్స్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి మురళి పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు అందరూ విజ్ఞతతో ఓటు హక్కుని వినియోగించుకున్నారని... కానీ,కేసీఆర్ 40 సీట్లు వాస్తే చాలు, మిగతా సీట్లు కొనొచ్చనే ధీమాతో ఉన్నాడని విమర్శించారు. అన్ని పార్టీలు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. రేపు ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి డబ్బు ఆశ చూపి సీట్లు కొనుక్కోవడానికి చూస్తారని అన్నారు.  ప్రజల చేత ఎన్నుకోబడి.. డబ్బుకోసం వేరే పార్టీలోకి వెళ్లే వారిని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

పార్టీ ఫిరాయింపులు జరగకుండా 1000 మందితో యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. 10 జిల్లాల్లో 15 టీమ్ లు పెట్టాలని..  ఎవరిపై అనుమానం ఉన్నా.. వాళ్ల ఇంటికి వెళ్ళి అడ్డగించాని ఆయన చెప్పారు. అవినీతిపరులపై ఈడి లాంటివి ఉపయోగించే మోడీ.. అంబానీ, అధానిలు అవినీతి చేసినా.. ఈడి దాడులు ఉండవని మండిపడ్డారు. గత తొమ్మిదినర సంవత్సరాలలో తెలంగాణలో ఎంతో అవినీతి జరిగిందని... కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దర్యాప్తు సంస్థలు ఏం చేయ్యవన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటేనని ఆకునూరి మురళి ఆరోపించారు.