హైదరాబాద్, వెలుగు: బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగిన గోల్ఫ్ రెండెజవన్ ప్రోఆమ్ లీగ్ (జీఆర్‌పీఎల్) రెండో అంచె పోటీల్లో హైదరాబాద్ అల్బాట్రోస్ జట్టు విజేతగా నిలిచింది.
అహ్మదాబాద్ ఏసెస్, ఢిల్లీ రాయల్స్ వరుసగా రెండు, మూడో ప్లేస్‌ను సాధించాయి. హైదరాబాద్ లెగ్‌లో హోమ్ టీమ్ విజయం సాధించినప్పటికీ.. మొదటి రెండు లెగ్‌లలో స్థిరమైన ప్రదర్శన చేసిన క్యాప్‌గెయిన్స్ అహ్మదాబాద్ ఏసెస్ జట్టు ఓవరాల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజా గెలుపుతో హైదరాబాద్ అల్బాట్రోస్ ఓవరాల్‌గా రెండో స్థానానికి చేరుకుంది.
