
రాష్ట్రంలో ఎలక్షన్స్ పూర్తి అయ్యేదాకా మద్యం అమ్మకాలు ఆపాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం అరికట్టాలన్నారు. గురువారం ఆయన బీఆర్కే భవన్లో సీఈవో వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల్లో అవినీతికి అవకాశం లేకుండా చూడాలని సీఈవోను కోరినట్లు చెప్పారు. పలు పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా జరిగే ఎన్నికలతోనే అసలైన అభ్యర్థులు, పార్టీ గెలుస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు.