
- ఫేక్ ఫ్రొడక్ట్స్, అన్ఆథరైజ్డ్ సేల్స్‌తో జర పైలం
- చిన్న ట్రిక్స్‌తో చెక్ చేసి కొంటే సేఫ్
- జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పండగలు వచ్చాయంటే.. ఈ కామర్స్వెబ్సైట్స్లో షాపింగ్జోరు పెరుగుతుంది. రూ. 100 నుంచి మొదలుకుంటే రూ. లక్షల రూపాయల వరకు.. గ్రాసరీ నుంచి మొదలుకుంటే ఎలక్ట్రానిక్ఐటమ్స్వరకు ప్రతి ఒక్కటీ తక్కువకు దొరుకుతుందని ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తుంటారు. ఆఫ్లైన్కంటే ఆన్లైన్లోనే ఆఫర్లు ఎక్కువగా వస్తాయని కస్టమర్లు అట్రాక్ట్అవుతుంటారు. అయితే, ఆన్లైన్షాపింగ్పట్ల అవగాహన, జాగ్రత్తలు లేకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్షాపింగ్చేస్తూ మోసపోతున్న వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై 2025లో జూన్వరకే 7,200కి పైగా కంప్లయింట్స్వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దీపావళి సేల్స్‌లోనూ ఇలాంటి మోసాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫేక్ ప్రొడక్టులు, అన్ఆథరైజ్డ్ సేల్స్
ఈ -కామర్స్ ప్లాట్‌ఫామ్స్ లో వివిధ రూపాల్లో మోసాలు జరుగుతున్నాయి. ఫేక్ (ఒకటి ఆర్డర్‌చేస్తే మరొకటి రావడం) బ్రాండ్ ను పోలిన రెప్లికా( అచ్చం ఒరిజినల్ లా కనిపించే డూప్లికేట్వస్తువు), బ్రాండ్ అబ్యూస్( చిన్న అక్షరాలతో బ్రాండ్‌పేరు మార్చి పంపడం) తో వేల మంది కస్టమర్లు నష్టపోతున్నారు. వీటితో పాటు అన్ఆథరైజ్డ్ప్రొడక్ట్స్అమ్మడం, ప్రొడక్టు క్వాలిటీని తప్పుగా చూపించడం, డెలివరీ జరగకపోవడం వంటి ఫ్రాడ్స్కామన్గా జరుగుతుంటాయి. ఇలా 2024 నుంచి 2025 జనవరి వరకు దేశవ్యాప్తంగా ఈ కామర్స్వెబ్సైట్స్వల్ల రూ.4,245 కోట్లకు పైగా నష్టం జరిగింది. 2025లో ఈ మొత్తం రూ.20వేల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అఫీషియల్ పార్ట్నర్స్ వద్దే కొనండి..
ఆన్లైన్లో వస్తువులు కొనే ముందు అస్యూర్డ్లేబుల్ఉందో లేదో చూసుకొని కొంటే రిస్క్ఉండదు. ఉదాహరణకు ఒక వస్తువును అఫీషియల్ఈ కామర్క్బ్రాండ్పార్ట్నర్మాత్రమే అమ్ముతుంది. అయితే అన్అఫీషియల్గా వేరే ప్లాట్ఫామ్లో కూడా ఈ సేల్స్జరుగుతుంటాయి. ఉదాహరణకు నథింగ్, మోటో వంటి కంపెనీలు తమ మొబైల్స్ఫ్లిప్కార్ట్లోనే అమ్ముతుంటాయి. అలాగే, వన్‌ప్లస్, ఐక్యూ వంటి కంపెనీలు అమెజాన్‌లో తమ ప్రొడక్ట్స్అఫీషియల్గా సేల్చేస్తుంటాయి. కానీ, మనం అప్పుడప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో వన్‌ప్లస్, ఐక్యూ.. అమెజాన్‌లో నథింగ్, మోటో మొబైల్స్కూడా కనిపిస్తుంటాయి. ధర కూడా అఫీషియల్పార్ట్నర్వెబ్సైట్స్కంటే తక్కువగానే కనిపిస్తుంది. అయితే, వీటిని కొనే ముందు కస్టమర్లు ఆలోచించాలి. ఎందుకంటే సెకండ్‌హ్యాండ్, రీఫర్బిష్డ్మొబైల్స్కూడా మనకు అంటగడుతుంటారు. ఒక వేళ అన్ అఫిషియల్ప్లాట్ఫామ్నుంచి కొంటే సదరు వస్తువు బ్రాండ్ వెబ్ సైట్లోకి వెళ్లి ఆ వస్తువు సీరియల్‌నంబర్, మొబైల్అయితే ఐఎంఈఐ నంబర్ఎంటర్చేసి కొత్తదో.. పాతదో తెలుసుకోవచ్చు. అందులో ఎప్పుడు మాన్యుఫ్యాక్చర్అయ్యింది. ఎప్పుడు యాక్టివ్అయ్యింది.. బ్యాటరీ ఎంత యూజ్అయ్యింది అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చు.
ఫేక్ వెబ్‌సైట్స్‌తో...
అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లా కనిపించే ఫేక్ వెబ్సైట్లు సృష్టించి సైబర్క్రిమినల్స్రూ.కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. వీరు సోషల్ మీడియాలో సదరు వెబ్సైట్స్అని చెప్తూ లింకులు పంపిస్తారు. అందులో ఆపిల్ఫోన్ రూ.5 వేలే అని, వేలల్లో ఉన్న వస్తువులు రూ.వందల్లో దొరుకుతాయని సోషల్‌మీడియాలో ప్రకటనలు పంపిస్తారు.అలాగే, ఏదైనా సెర్చ్ఇంజిన్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్అని టైప్‌చేయగానే పైన నకిలీ వెబ్సైట్స్ఉండేలా చూస్తారు. వీటిని క్లిక్‌చేస్తే ఫేక్వెబ్సైట్లోకి వెళ్తారు. అచ్చం ఒరిజినల్వెబ్సైట్మాదిరే డిజైన్చేస్తారు. ఇక్కడ పేమెంట్చేయడం వల్ల కస్టమర్లు నష్టపోతారు. అలాగే, మోసగాళ్లు కస్టమర్లకు బిగ్బిలియన్డేస్లో తక్కువ ధరకు ప్రొడక్ట్స్ఇస్తున్నామని ఫేక్ ఈమెయిల్స్, ఎస్ఎమ్ఎస్‌లు పంపుతారు. ఇలాంటి మోసాలకు ఎక్కువగా దసరా, దీపావళి, సంక్రాంతి, రిపబ్లిక్‌డే, ఇండిపెండెన్స్‌డే వంటి రోజులను ఎంచుకుంటారు.
ఇవిగో జాగ్రత్తలు..
- అమెజాన్‌లో ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్పేరుతో దీపావళి సేల్ మొదలవ్వగా, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్’ అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కస్టమర్లు కింది జాగ్రత్తగా తీసుకుంటే మోసపోకుండా ఉంటారు.
- ఈ కామర్స్అస్యూర్డ్ప్రొడక్ట్స్మాత్రమే కొనండి. అస్యూర్డ్అంటే సదరు ప్రొడక్ట్‌కు తమది గ్యారంటీ అని ఈ కామర్స్వెబ్సైట్ గ్యారంటీ ఇస్తుందన్నమాట..
- వస్తువు కొనేటప్పుడు దాని సెల్లర్ఎవరు? బ్రాండ్రిజిస్టర్అయి ఉందా లేదా చెక్చేయండి.
- ప్రొడక్ట్రేటింగ్చూసి కొనడానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు.. ఈ మధ్య పేరు మోసిన కంపెనీలు కూడా కస్టమర్లను ప్రలోభ పెట్టి రేటింగ్‌లు తీసుకుంటున్నాయి. దీనికి బదులు చాలా మంది యూట్యూబర్లు ప్రొడక్ట్స్రివ్యూలను ఇస్తుంటారు. ఇందులో రెండు లేదా మూడు వీడియోలు చూస్తే ఆ ప్రొడక్ట్ఎలాంటిదో తెలిసిపోతుంది.
- ఫేక్ లింక్‌లు క్లిక్ చేయకండి. స్పామ్ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెసేజ్ వచ్చినా క్లిక్ చేయకుండా.. ఒరిజనల్ వైబ్సైట్లోకి లాగిన్ అయి.. ఆఫర్చెక్ చేసుకుంటే బెటర్..
- అక్స్ నౌ, లిమిటెడ్ స్టాక్, వంటి మెసేజ్‌లు వెంటనే నమ్మవద్దు.
- సెక్యూర్ పేమెంట్స్: యూపీఐ కార్డ్ వివరాలు షేర్ చేయకండి. ఓటీపీలు అడిగితే జాగ్రత్తగా ఉండాలి. HTTPS అనే సేఫ్డొమైన్లు చెక్ చేయండి.
- ప్రొడక్ట్ డెలివరీ టైం, అన్బాక్సింగ్చేసేప్పుడు వీడియో తీసుకోండి. ఫేక్, తప్పు ప్రొడక్ట్ వచ్చినా ఎవిడెన్స్‌గా ఉపయోగపడుతుంది.
- అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లు వచ్చినప్పుడు సదరు ఫేక్ఈ కామర్స్వెబ్సైట్స్గురించి సైబర్‌క్రైమ్ పోర్టల్ కు రిపోర్ట్ చేయండి.