కాంగ్రెస్‌‌‌‌లో ఓటర్ల కంటే సీఎం అభ్యర్థులే ఎక్కువ : గొంగిడి సునీత

కాంగ్రెస్‌‌‌‌లో ఓటర్ల కంటే సీఎం అభ్యర్థులే ఎక్కువ : గొంగిడి సునీత
  •     ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌లో ఓటర్లకంటే సీఎం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి, రామశెట్టిపల్లి, కొండాపూర్, శ్రీనివాసపూర్, గోపాల్ పూర్, నాగాయిపల్లి తండా, నాగాయిపల్లి, కెవ్లా తండా, పొట్టిమర్రితండా, చిన్నలక్ష్మాపూర్, మాదాపూర్ లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ పార్టీ నేతలు రైతుబంధు దుబారా పథకం, రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలనే రాష్ట్రానికి  శ్రీరామ రక్ష అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మూడోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

ALSO READ : రేడియో లైవ్.. స్టూడియోకు వచ్చిన కాల్చి చంపేశారు

అలాగే  యాదగిరిగుట్ట మండలం సైదాపురం, బొమ్మలరామారం మండలం బోయినపల్లి, మేడిపల్లి, గుండాల మండలం కొమ్మాయిపల్లి, యాదగిరిగుట్ట టౌన్ నుంచి 500 మంది కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు.