యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణాల్లో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలవడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో లబ్ధిదారులు నక్క మహేశ్, -మధుశ్రీ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులకు పట్టుబట్టలు పెట్టి యాటపోతును కానుకగా ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఆలేరు నియోజకవర్గాన్ని మొదటి ప్లేస్ లో నిలిపిన ఘనత అధికారులకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోసరిగా అమలు చేయడంలో ఆఫీసర్ల కృషి వెలకట్టలేనిదని అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లాపురం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
