ప్రజా వ్యతిరేక బడ్జెట్: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

ప్రజా వ్యతిరేక బడ్జెట్: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశపెట్టన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్​శంకర్, పాల్వయ్​హరీశ్​బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి రూ.33 వేల కోట్ల ఆదాయం, రూ.62వేల కోట్ల అప్పు తీసుకువస్తామని చెప్తున్నారని.. ఎఫ్ఆర్​బీఎం పరిధిలో ఇదెలా సాధ్యమో చెప్పలేదన్నారు.

అలాగే రూ.50వేల కోట్ల రెవెన్యూ వస్తుందంటున్నరు.. కానీ అది ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, హమీలు తప్ప కేటాయింపులు లేవని తెలిపారు. 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు.