
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ఈ టెక్నో స్కూల్ఎన్సీసీ కేడెట్లకు శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ ప్రోగ్రాం స్కూల్ చైర్మన్ నరేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి దేశభక్తి పెంపొందించుకుని దేశం పట్ల విధేయత ప్రదర్శించాలన్నారు. ఎన్సీసీతో దేశ సమగ్రతను పెంపొందించడమే కాకుండా దేశంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలను అరికట్టవచ్చన్నారు. 46 మంది విద్యార్థులకు ఏ సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ పాల్గొన్నారు.