ఎల్లో ట్రెండీ వేర్ లో ఆలియా అదుర్స్

 ఎల్లో ట్రెండీ వేర్ లో ఆలియా అదుర్స్

బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన డార్లింగ్స్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో ఆలియా కనిపించిన తీరు ఇప్పుడు ట్రెండింగ్ మారింది. ఎల్లో ట్రెండీ వేర్ లో హాజరైన ఆలియా.. చాలా షార్ట్ గా  వదులుగా ఉన్న డ్రెస్ ను ధరించింది.  దాంతో పాటు బేబీ బంప్ ను దాచేస్తూ మరోవైపు లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ ఆలియా ప్రమోషన్స్ లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి నిర్మాతగా ఆలియా తొలిసారిగా ఈ సినిమాను నిర్మిస్తోంది.

Alia Bhatt Announces Her Production House | Eternal Sunshine

ఇటీవలే తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలా పెళ్లి చేసుకుందో లేదో ప్రెగ్నెన్సీ న్యూస్ తో అందర్నీ షాక్ గురి చేసిన సంగతి కూడా విధితమే. అయినా కూడా ఆమె సినిమా షూటింగ్స్ లో, ప్రమోషన్స్ లో అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. దీంతో ఈ సమయంలోనూ ఆమె చూపిస్తున్న డెడికేషన్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తు్న్నారు. అప్పట్లో సడక్ 2 సినిమా నేపథ్యంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొన్న ఆలియా.. ఆ తర్వాత ఆమె వాటిని పట్టించుకోవడం మానేశారు.

Not Ranbir Kapoor, but THESE people are Alia Bhatt's Darlings - Movies News

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గంగుభాయ్ ఖతీయవాడి సినిమాతో నటిగా మంచి ప్రశంసలు అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. దీంతో డార్లింగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా త్వరలోనే విడుదల కానుండడంతో  సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక డార్లింగ్స్ 
మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 5 నుండి స్ట్రీమ్ కానుంది.