
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన ఆలియా భట్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. సినిమా చూసినవాళ్లు కూడా ఆలియాని అసలెందుకు తీసుకున్నట్టు, ఆ పాత్రకి ఆమె అవసరమా అంటూ కామెంట్ చేశారు. దాంతో ఆలియా హర్ట్ అయ్యిందని, తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ‘ఆర్‌ఆర్ఆర్’కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేసిందని, రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇవి అంతకంతకు ఎక్కువవుతూ ఉండటంతో చివరికి ఆలియా రియాక్టయ్యింది. ‘నాపై వస్తున్న వార్తలన్నీ నేను విన్నాను. దయచేసి ఎవరికి వారు ఊహించేసుకోవద్దు. నేను ఎప్పటికప్పుడు పాత వీడియోలు డిలీట్ చేస్తుంటాను. ఆ ప్రాసెస్‌లోనే ఇది జరిగింది తప్ప మరేమీ లేదు. టీమ్ అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇంత మంచి సినిమా తీశారు. సీత పాత్ర నాకు చాలా నచ్చింది. తారక్‌తో, రామ్ చరణ్‌తో పని చేయడం గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటించి నందుకు, రాజమౌళి గారితో పని చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి ప్రచారం చేయకండి’ అని చెప్పింది ఆలియా. దాంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్‌కి చెక్ పెట్టినట్టయ్యింది.