హీరోయిన్ అయితే ఇంట్లోకి కూడా వచ్చేస్తారా..? అలియా ఆగ్రహం

హీరోయిన్ అయితే ఇంట్లోకి కూడా వచ్చేస్తారా..? అలియా ఆగ్రహం

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ  గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అలియా భట్.. ఇటీవల కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తన ప్రైవేట్ స్పేస్‌కు ఇబ్బంది కలిగించడమే దీనికి కారణం. అసలు విషయం ఏమిటంటే.. ఆమె పికిల్ బాల్ ఆడి ఇంటికి వస్తుండగా, కొందరు ఫొటోగ్రాఫర్లు తన కారును ఫాలో అవుతూ ఇంటి వరకు రావడమే కాకుండా.. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.  ఆ ఫొటోగ్రాఫర్లను మొదట రిక్వెస్టింగ్‌గా బయటకు వెళ్లమని కోరింది. అయినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్లీజ్ లోపలికి రావొద్దు. ఇదేమీ మీ ఇల్లు కాదు. దయచేసి వెళ్లిపోండి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు మీడియా వ్యక్తులు  లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ‘వార్‌‌ 2’లో గెస్ట్ రోల్ చేసిన అలియా.. ప్రస్తుతం ‘అల్ఫా’ మూవీ చేస్తోంది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్‌ బ్యానర్‌‌పై రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్  త్వరలోనే ప్రారంభం కానుంది.