OMG : ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా వెళ్లింది..?

OMG : ఊపిరితిత్తుల్లోకి బొద్దింక ఎలా వెళ్లింది..?

అప్పుడప్పుడు నమ్మశక్యం కాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కేస్ ఒకటి కేరళలోని అమృత హాస్పిటల్ లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఊపిరితిత్తుల్లో 4సెంటీమీటర్ల బొద్దింకను చూసి డాక్టర్లు సైతం షాక్ అయ్యారు. డాక్టర్ల కథనం ప్రకారం ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 22న అమృత హాస్పిటల్ కి ఒక 55ఏళ్ళ వ్యక్తి తీవ్ర శ్వాసకోశ సమస్యతో వచ్చాడు. అక్కడ ఉన్న పల్మనాలజీ డాక్టర్లు అతని ఊపిరితిత్తుల్లో బొద్దింక ఉన్నట్టు గుర్తించారు.

ఆ వ్యక్తికి ముందుగానే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న కారణంగా ఆక్సిజన్ సరఫరా కోసం మెడ నుండి ఒక పైప్ అమర్చారు డాక్టర్లు. ఆ పైప్ ద్వారానే బొద్దింక ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు నిర్దారించారు. సుమారు 8గంటల పాటు శ్రమించి ఆ బొద్దింకను బయటికి తీశామని తెలిపారు డాక్టర్లు.పైప్ అమర్చే సమయంలో నిర్లక్ష్యం వహించటమే ఇందుకు కారణమై ఉండచ్చని డాక్టర్లు అన్నారు.

ఇలాంటి కేసులు అప్పుడప్పుడు సహజమే అయినప్పటికీ, ఊపిరితిత్తుల్లోకి చేరిన బొద్దింక బతికి ఉండటం చాలా  రేర్ కేస్ అని డాక్టర్లు అభిపాయపడ్డారు.యూఎస్ లో ఇలాంటిదే  ఒక కేసు నమోదయ్యిందని అన్నారు. ఓ వ్యక్తి ముక్కులో దోమలను గుర్తించారని అన్నారు. ఇంకో కేసులో ఓ 65ఏళ్ళ వ్యక్తి కడుపులో ఈగను గుర్తించినట్టు తెలిపారు. ఆ వ్యక్తికి కొలనోస్కోపీ చేసే సమయంలో ఈగను గుర్తించమని డాక్టర్లు అన్నారు.