నా చుట్టూ అంతా అలాంటి వాళ్లే : మిల్కీ బ్యూటీ తమన్నా

నా చుట్టూ అంతా అలాంటి వాళ్లే : మిల్కీ బ్యూటీ తమన్నా

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత మిల్కీ బ్యూటీ తమన్నాకు సరిగ్గా సరిపోతుంది. సౌత్​లో కెరీర్​ పీక్స్​లో ఉండగానే బాలీవుడ్​కి చెక్కేస్తుంటారు కొందరు హీరోయిన్లు. కానీ, దాదాపు రెండు దశాబ్దాల పాటు సౌత్​లో అగ్ర హీరోలందరితోనూ ఈ బ్యూటీ జోడీ కట్టింది. ఇప్పుడు బాలీవుడ్​లోనూ తన హవా కొనసాగిస్తోంది. అయితే, ఇన్నేళ్ల తన సినీ కెరీర్​ తనకు ఎన్నో కొత్త పాఠాలను నేర్పిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

తన చుట్టూ ఉన్న వాళ్లు ఎంతో మంది తనతో ఎంతో ప్రేమగా నటిస్తారని.. కానీ, అది కేవలం ఒక ముసుగు మాత్రమేనని కామెంట్స్​ చేసింది. మనం ఎదుగుతుంటే వారెంతో జలసీ ఫీలవుతారని.. బయటకు మాత్రం ప్రేమను ఒలకబోస్తారని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్​ ఆమెకు మద్దతిస్తుంటే మరికొందరేమో జలసీ ఫీలయ్యేంత స్టార్​ హీరోయిన్​వేమీ కాదు కదా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.