ఒక్కరు తప్ప అందరి డిపాజిట్లు గల్లంతు

ఒక్కరు తప్ప అందరి డిపాజిట్లు గల్లంతు

పశ్చిమ బెంగాల్​లో లెఫ్ట్ ఫ్రంట్ దుస్థితి

న్యూఢిల్లీ: ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన గడ్డ అది. దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలిన రాష్ర్టమది. కాలం గిర్రున తిరిగింది. ఓడలు బండ్లయినయ్. అధికారం సంగతి దేవుడెరుగు. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి దిగజారిపోయారు కమ్యూనిస్టులు. పశ్చి మ బెంగాల్ లో వారి ప్రస్తుత పరిస్థితి గురించే ఇదంతా. లోక్​సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఘోరంగా ఓడిపోయింది. పోటీచేసిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా, మిగతా వారందరూ డిపాజిట్లు కోల్పోయారు . జాదవ్ పూర్ నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి బికాశ్ రంజన్ భట్టాచా ర్య మాత్రమే 21.04శాతం ఓట్లు సాధించి , డిపాజిట్ దక్కించుకున్నారు . చాలా సీట్లలో లెఫ్ట్ అభ్యర్థులకు పడ్డ ఓట్లు 10 శాతం కూడా దాటలేదు. మొత్తంగా చూస్తే లెఫ్ట్ పార్టీలకు దేశవ్యాప్తంగా కేవలం 5 సీట్లు మాత్రమే దక్కా యి. 1952 నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టులకు అతి తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి.