Samsung Galaxy A55 కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లు, బ్యాటరీ, ధర లీక్..

Samsung Galaxy A55 కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లు, బ్యాటరీ, ధర లీక్..

Samsung కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A55ని ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ ఫోన్ సంబంధించిన ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 8GB RAM 256 GB స్టోరేజ్ తో Exynos 1480 చిప్ సెట్ తో వస్తుందని తెలుస్తోంది. విన్ ఫ్యూచర్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. Samsung Galaxy A 55 మార్చి 11 న మార్కెట్లో కి వచ్చే అవకాశం ఉంది. 

ఈ ఫోన్ ధర రూ. 40,300 ఉండవచ్చని అంచనా.. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్ ఉంటుందని తెలుస్తోంది. Samsung Galaxy A55  స్మార్ ఫోన్ 606 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది OIS, f/1.7 ఎపర్చర్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్ తో 12 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా , f/2.2ఎపర్చర్ తో కూడిన 5 మెగా పిక్సెల్ ట్రిపురల్ కెమెరా అమర్చబడి ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ముందు భాగంగా f/2.2 ఎపర్చర్ తో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ , నేవీ , పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. Samsung Galaxy A55 కంపెనీ Exnos 1480 చిప్ సెట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. One UI6.1 అవుట్ ఆప్ ది బాక్స్ తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM +128 GB , 8GB RAM+256 GB స్టోరేజ్ కన్ఫిగరేషన్ లతో వస్తుంది. 

ALSO READ :- Tera Kya Hoga Lovely: కార్తీక దీపం కాన్సెప్ట్‌తో ఇలియానా మూవీ! ఇదిగో ట్రైలర్

బ్యాటరీ విషయానికి వస్తే.. పవర్ కోసం 5000 mAh బ్యాటరీని పొందవచ్చు. కనెక్టివిటీ కోసం స్టీరియో స్పీకర్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. Samsung Galaxy A55 డస్ట్, వాటర్ ఫ్రూఫ్ కోసం IP67 రేటింగ్ ను పొందింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi6, బ్లూటూత్ 5.3,GPS, NFC కనెక్టివిటీ ని అందిస్తుంది.ఇది USB 2.0 type -C పోర్ట్ తో కూడా అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ భారత్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే కంపెనీ త్వరలో  ప్రకటించనుంది.