‘పఠాన్‌‌’పైనే అందరి దృష్టీ

 ‘పఠాన్‌‌’పైనే అందరి దృష్టీ

లాంగ్ బ్రేక్ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ‘పఠాన్‌‌’పై అందరి దృష్టీ ఉంది. భారీ యాక్షన్ సినిమాలు తీసే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కావడం, దీపికా పదుకొనె హీరోయిన్‌‌గా చేస్తుండటం కూడా సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. అయితే అంతకంటే ఎక్కుగా అందరినీ ఆకర్షించిన విషయం.. జాన్ అబ్రహామ్ విలన్ క్యారెక్టర్ చేస్తుండటం. నిన్న అతని ఫస్ట్ లుక్‌‌ని సోషల్‌‌ మీడియా ద్వారా లాంచ్ చేసిన షారుఖ్.. ‘అతను కాస్త టఫ్.. అతని ఆట చాలా రఫ్’ అంటూ క్యారెక్టర్‌‌‌‌ని పరిచయం కూడా చేశాడు.

సీరియస్‌‌ లుక్‌‌లో టెరిఫిక్‌‌గా ఉన్నాడు జాన్. ‘సాధార‌‌ణంగా విల‌‌న్‌‌కి ఇచ్చే ఎలివేష‌‌న్ గొప్పగా ఉండాలి. అలాగ‌‌ని హీరో అంత గొప్పగా ఉండాల‌‌ని నా ఉద్దేశం కాదు. కానీ.. విల‌‌న్ పాత్రని గొప్పగా ఆవిష్కరించిన‌‌ప్పుడు హీరో, విల‌‌న్‌‌ల మ‌‌ధ్య పోరు ర‌‌స‌‌వ‌‌త్తరంగా ఉంటుంది. ఈ సినిమాలో అది చూస్తారు’ అంటున్నాడు దర్శకుడు. యశ్‌‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ప్రెస్టీజియస్‌‌గా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.