డిసెంబర్ 20 నుంచే ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా

డిసెంబర్ 20 నుంచే ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా

గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ, నేషనల్​జ్యూట్​బోర్డు ఆధ్వర్యంలో ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం ‘ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా’ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 450 స్టాళ్లు శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. 

మేళా సందర్భంగా ప్రతి రోజు శాస్త్రీయ, జానపద, సంగీత వాయిద్య సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ (తంజావూర్), సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ (నాగపూర్) ఆధ్వర్యంలో సిద్ధి ఢమాల్, ఫాగ్ అండ్ ఘుమార్, చౌ నృత్యం, గారడీ గొంబె, కర్గం, కావడి, సంబల్పూరి జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. భారతీయ కళాకారులతో పాటు లండన్, దుబాయ్, కాలిఫోర్నియా, హవాయి, టెక్సాస్, ఫోనిక్స్‌విల్లే, హాంగ్‌ కాంగ్ నుంచి ప్రవాస భారతీయులు కూడా పాల్గొంటున్నారని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు తెలిపారు.