తిరుపతిలో ప్రపంచ స్థాయి టౌన్ షిప్...డెల్లా గ్రూప్ తో ఏపి ప్రభుత్వం ఒప్పందం..

తిరుపతిలో  ప్రపంచ స్థాయి టౌన్ షిప్...డెల్లా గ్రూప్ తో ఏపి ప్రభుత్వం ఒప్పందం..
  • 14 వందల ఎకరాలలో వసుదైక కుటుంబం పేరుతో టౌన్ షిప్...
  • టిటిడి, ఏపి టూరిజం సహకరంతో నిర్మాణం...
  • తిరుపతి ఎయిర్​ పోర్ట్​ సమీపంలో శ్రీకారం....

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్బుతమైన కొత్త టౌన్ షిప్ రాబోతోంది. ప్రతిషాత్మక ఆధ్యాత్మిక అంతర్జాతీయ టౌన్ షిప్ నిర్మాణానికి ఏపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తిరుపతిలో డెల్లా వసుదైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. 

తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో కొత్తగా టౌన్​ షిప్​ ను నిర్మించేందుకు  టీటీడీ... ఏపి టూరిజం సహకరంతో నిర్మాణానికి   శ్రీకారం చుట్టింది.  డెల్లా టౌన్‌షిప్స్‌ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. సుమారు రూ.35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

  హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రపంచానికి 5 వేల సంవత్సరాలపాటు  తెలియజేసేందుకు  మొట్టమొదటి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణలలో ఒకటి అని డెల్లా గ్రూప్ వర్గాలు తెలిపాయి.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉండడం తిరుపతికి ప్రపంచ చిత్రపటంలో ఓ గుర్తింపు ఉంది. వరల్డ్ రిచ్చెస్ట్ టెంపుల్స్ లో తిరుమల ఒకటి. అందుకే ప్రపంచ నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది తిరుపతికి వస్తుంటారు. ఇక ఇదే సమయంలో మరో ప్రతిషాత్మక ఆధ్యాత్మిక అంతర్జాతీయ టౌన్ షిప్ నిర్మాణానికి ఏపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

తిరుపతిలో అధ్యాత్మిక టౌన్ షిప్ నిర్మాణానికి డెల్లా సంస్థతో ఒప్పందం జరిగింది. డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్‌ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. హిందూమతంపై ప్రపంచంలోనే తొలి 5,000 ఏళ్ల జీవన ప్రదర్శన (లివింగ్‌ ఎగ్జిబిషన్‌)ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు మొత్తం సుమారు రూ.35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

 డిజైన్‌ ఫ్యూచరిస్ట్, డెల్లా టౌన్‌షిప్స్‌ వ్యవస్థాపకులు జిమ్మీ మిస్త్రీ సహకారంతో ఈ టౌన్​షిప్​ నిర్మించనున్నారు. దీని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం తో డెల్లా సంస్త ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.  టీటీడీ, రాష్ట్ర పర్యాటకశాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

హిందూమతానికి సంబంధించిన వారసత్వ సంపద, సంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది. ​వసుధైక కుటుంబం పేరుతో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్‌షిప్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలు, మెడికల్ వెల్‌నెస్ సెంటర్లు, అడ్వెంచర్ పార్కులు, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, అత్యున్నత రియల్ ఎస్టేట్ అంశాలు అన్నీ కలిపి ఉంటాయి.

 ఈ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ తిరుపతిని ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్‌గా మారుస్తుందని డెల్లా గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. 300 ఎకరాల్లో లివింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక్కొక్కటి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 పెవిలియన్లు ఉంటాయి. సింధూలోయ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వచింతన వరకు కూడా భారత నాగరికతను ఇవి ప్రతిబింబిస్తాయి. అదే విధంగా వేద విజ్ఞాన వ్యవస్థలు, ఆలయ నిర్మాణ శిల్పం, శాస్త్రీయ కళలు, ప్రాంతీయ సంప్రదాయాలు, ఆచారాలు వంటివి ప్రదర్శనలో ఉంటాయి.

 అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానించనున్నారు. లివింగ్‌ ఎగ్జిబిషన్‌తో పాటు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేట్‌ విల్లాలు అభివృద్ధి చేయనున్నారు. 600కు పైగా గదులతో ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌లు... డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలు సైతం అందుబాటులోకి రానున్నాయి..