- సచివాలయానికి పిలుపించుకొని డీసీహెచ్ఎస్, డాక్టర్లకు ప్రశంసించిన మంత్రి
- ఏజెన్సీలో స్ఫూర్తి దాయక సేవలపై మంత్రి హెల్త్ సెక్రటరీ ప్రశంసలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) హాస్పిటళ్ల వైద్య సేవలు ఏజెన్సీలో స్ఫూర్తి దాయకంగా ఉన్నాయని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ప్రశంసించారు. టీవీవీపీ హాస్పిటళ్ల ద్వారా ఏజెన్సీ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన మంత్రి, హెల్త్ సెక్రటరీ జిల్లాలోని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుతో పాటు పలువురు డాక్టర్లను సచివాలయానికి పిలిపించుకొని శుక్రవారం ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అద్భుతమైన వైద్య సేవలను అందించడం గ్రేట్ అన్నారు. జిల్లాలోని టీవీవీపీ హాస్పిటళ్లు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతమైన చర్లలోనూ టీవీవీపీ హాస్పటల్ సేవలు చాలా బాగున్నాయన్నారు.
