ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని

ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కొత్తగూడెం క్లబ్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీపీఐ 47 సర్పంచ్​స్థానాలు, 57 ఉప సర్పంచ్, 432వార్డు  స్థానాల్లో విజయం సాధించిందన్నారు. 

కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్​ కంటే సీపీఐకి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్​ నేతలు దిగజారుడు రాజకీయాలు చేశారని, స్నేహ సంబంధాన్ని నిలుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే సాబీర్​ పాషా, నేతలు కల్లూరి వెంకటేశ్వర రావు, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, దుర్గారాశి వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, లక్ష్మీకుమారి, కె. సారయ్య, పూర్ణ చందర్​ రావు పాల్గొన్నారు.